Share News

Minister: మంత్రి సంచలన కామెంట్స్... మా ప్రజల హృదయాల్లో బీజేపీకి తావులేదులే...

ABN , First Publish Date - 2023-10-22T10:12:08+05:30 IST

కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ(BJP) ఎన్ని కుటిల ప్రయత్నాలు సాగించినా తమిళుల హృదయాల్లో స్థానం సంపాదించ

Minister: మంత్రి సంచలన కామెంట్స్... మా ప్రజల హృదయాల్లో బీజేపీకి తావులేదులే...

- నీట్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ(BJP) ఎన్ని కుటిల ప్రయత్నాలు సాగించినా తమిళుల హృదయాల్లో స్థానం సంపాదించ లేదని డీఎంకే యువజన విభాగం నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలో శనివారం ఉదయం నీట్‌కు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించి తొలి సంతకం చేశారు. డీఎంకే వైద్యవిభాగం కార్యదర్శి ఎళిలన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా, వైద్య విభాగం అధ్యక్షురాలు కనిమొళి ఎన్వీఎన్‌ సోము, ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి ఉదయినిధి మాట్లాడుతూ... నీట్‌ రద్దు కోసం డీఎంకే, దాని యువజన విభాగం కలిసికట్టుగా పోరాడుతూనే ఉంటాయని చెప్పారు. నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలను సేకరించి, వాటిని రాష్ట్రపతికి పంపనున్నామని తెలిపారు. నీట్‌ వల్ల నాణ్యమైన డాక్టర్లు లభిస్తారని, వైద్య కళాశాలల్లో డొనేషన్లు రద్దవుతాయని కేంద్రంలోని బీజేపీ పాలకులు గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం నీట్‌లో జీరో మార్కులు లొచ్చినా ఎంబీబీఎస్‌ పట్టభద్రులు పీజీ కోర్సుల్లో చేరవచ్చునని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నీట్‌కు వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు పిలుపునిస్తున్నానని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న అన్నాడీఎంకే(AIADMK) నిర్భయంగా నీట్‌ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచు కోవచ్చునని చెప్పారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నానని, అన్ని పార్టీలు కలిసి పోరాడితే జల్లికట్టు ఉద్యమంలా నీట్‌ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతుందన్నారు.

nani1.jpg

nani1.3.jpg

Updated Date - 2023-10-22T10:12:08+05:30 IST