Minister: మంత్రి సంచలన కామెంట్స్.. ఐటీ, ఈడీలు బీజేపీ కూటమి పార్టీలే..
ABN , First Publish Date - 2023-11-05T11:19:08+05:30 IST
ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు బీజేపీ కూటమి పార్టీలని, ప్రతిపక్షాలపై ఈ రెండు ఆయుధాలను ప్రయోగిస్తోందని
పెరంబూర్(చెన్నై): ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు బీజేపీ కూటమి పార్టీలని, ప్రతిపక్షాలపై ఈ రెండు ఆయుధాలను ప్రయోగిస్తోందని న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) వ్యాఖ్యానించారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, రౌడీల ఆగడాలు అడ్డుకొనేలా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. తూత్తుకుడి తుపాకీ కాల్పుల వ్యవహారానికి సంబంధించి మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్ కమిటీ సిఫారసుపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని న్యాయస్థానానికి తెలియజేసినట్లు మంత్రి తెలిపారు.