Share News

Minister: ‘నీట్‌’కు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం

ABN , First Publish Date - 2023-10-19T09:54:56+05:30 IST

నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం చేపట్టనున్నట్లు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల

Minister: ‘నీట్‌’కు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం

పెరంబూర్‌(చెన్నై): నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం చేపట్టనున్నట్లు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) తెలిపారు. రాష్ట్ర విద్యారంగ హక్కులు, వైద్యులు కావాలనుకొనే విద్యార్థుల పట్టుదలను నాశనం చేస్తున్న నీట్‌కు వ్యతిరేకంగా డీఎంకే పలు చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా పార్టీ యువజన, విద్యార్థి, వైద్య విభాగాల ఆధ్వర్యంలో గత ఆగస్టు 20వ తేది నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. తమ ఉద్యమంలో తదుపరి సంతకాల సేకరణ చేపట్టనున్నామని తెలిపారు. ఆ ప్రకారం, ఈ నెల 21వ తేది అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ చేపట్టనున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొని నీట్‌పై తమ వ్యతిరేకత తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-19T09:54:56+05:30 IST