Share News

Minister: పిట్టకథ చెప్పి సభికులను నవ్వింపజేసిన మంత్రి.. ఇంతకీ ఏంటా కథ అంటే...

ABN , First Publish Date - 2023-10-22T10:34:41+05:30 IST

రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూనే మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఓ పిట్టకథ చెప్పి సభికులను

Minister: పిట్టకథ చెప్పి సభికులను నవ్వింపజేసిన మంత్రి.. ఇంతకీ ఏంటా కథ అంటే...

చెన్నై: రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూనే మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఓ పిట్టకథ చెప్పి సభికులను నవ్వించారు. ఓ సారి తాళంచెవి వద్దకు వెళ్ళి సుత్తి దానికంటే తాను బలంగా ఉన్నా బీగాన్ని తెరువలేకపోతున్నానని, అయితే తాళం చెవి సులువగా బీగాన్ని ఎలా తెరవగలుగుతోందని ప్రశ్నించిందన్నారు. తాళం చెవి సమాధానం ఇస్తూ... సుత్తి బీగం తలపై కొట్టి బీగాన్ని ముక్కలు చేసి తెరుస్తుందని, అయితే తాను బీగం హృదయాన్ని తాకి సులువుగా తెరుస్తున్నానని బదులిచ్చిందన్నారు. ఈ పిట్ట కథలోని సుత్తి లాగే బీజేపీ ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం వీలు కాదని అన్నారు.

nani2.jpg

Updated Date - 2023-10-22T10:34:41+05:30 IST