Minister Udayanidhi: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-09-28T09:18:29+05:30 IST
అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) కూటమి విచ్ఛిన్నం వారి అంతర్గత వ్యవహారమని, దాన్ని తాము కామెడి సన్నివేశంగా చూస్తున్నామని,
- అన్నాడీఎంకే - బీజేపీ కూటమి విచ్ఛిన్నం హాస్యాస్పదం..
పెరంబూర్(చెన్నై): అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) కూటమి విచ్ఛిన్నం వారి అంతర్గత వ్యవహారమని, దాన్ని తాము కామెడి సన్నివేశంగా చూస్తున్నామని, రేపు మోదీ, అమిత్‌షాల నుంచి కబురు వస్తే వీరు పోకుండా ఉంటారా? అంటూ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ... చెన్నై నుంచి ఢిల్లీ(Chennai to Delhi)కి నేరుగా విమానం ఉండగా, అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎవరికీ తెలియకుండా ఇద్దరు కొచ్చిన్ నుంచి, మరొకరు బెంగళూరు నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అన్నాడీఎంకేపై విమర్శలు చెయ్యొద్దని బీజేపీ అధిష్ఠానం, బీజేపీపై విమర్శలు చెయ్యొద్దని అన్నాడీఎంకే అధిష్ఠానం చెప్పడం ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు కుస్తీలు పట్టడం ఇది కొత్తకాదన్నారు. ఆ పార్టీ మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులపై ఈడీ కేసులున్నాయని, అవినీతి కేసులో శిక్ష పొందిన ఒకే ముఖ్యమంత్రి ఆ పార్టీకి చెందిన వారేనని అన్నారు. ఒకే ఒక ఫోన్ కాల్ చాలని, అన్నింటినీ పక్కనబెట్టేస్తారన్నారు. వారు విడిపోయినా, కలిసినా తమకెలాంటి అభ్యంతరం లేదని, తమ కూటమి ఎన్నికల కోసం కాదని, సిద్ధాంతాల రీత్యా ఏర్పాటైందని మంత్రి తెలిపారు.