Minister Udayanidhi: అసలు విషయం చెప్పేసిన మంత్రి.. అర్హురాలైన ఏ మహిళనూ తప్పించబోం..
ABN , First Publish Date - 2023-10-11T09:09:38+05:30 IST
అర్హత కలిగిన ఏ ఒక్క మహిళను ‘కలైంజర్ మహిళా సాధికారికత ప్రోత్సాహక నిధి’ పథకం నుంచి తప్పించబోమని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు.
పెరంబూర్(చెన్నై): అర్హత కలిగిన ఏ ఒక్క మహిళను ‘కలైంజర్ మహిళా సాధికారికత ప్రోత్సాహక నిధి’ పథకం నుంచి తప్పించబోమని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో, అర్హులైన ప్రతి మహిళకు ఈ పథకం అందేలా సీఎం స్టాలిన్ చర్యలు చేపట్టారన్నారు. తమ నియోజకవర్గంలోని అర్హులైన మహిళలను ఈ పథకంలో చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడిపై ఉందన్నారు. ఈ పథకానికి కొత్త వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణ గురైన వారు కూడా మళ్లీ అప్పీలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.