Minister Udayanidhi: ప్రభుత్వ పథకాలపై మంత్రి ఉదయనిధి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-07-20T11:44:08+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలని రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. గురువారం

Minister Udayanidhi: ప్రభుత్వ పథకాలపై మంత్రి ఉదయనిధి ఏమన్నారంటే..

అడయార్‌(చెన్నై): ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలని రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. గురువారం తిరువణ్ణామలై జిల్లా కలెక్టరేట్‌లో ఆయన ప్రభుత్వ పథకాల అమలు తీరు, జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొన్ని పథకాల అమలుతో స్తబ్దత నెలకొనివుందని, దాన్ని పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే అర్హులైన ప్రతి కుటుంబంలోని గృహిణికి రూ.1000 ఆర్థిక సాయం అందజేసే పథకం ప్రారంభంకానుందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.7 వేల కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మురుగేష్‌, మంత్రి ఏవీ వేలు తదితరులు పాల్గొన్నారు.

nani11.2.jpg

Updated Date - 2023-07-20T11:44:08+05:30 IST