Tamilanadu: యావత్ దేశం దద్దరిల్లేలా యువజన మహానాడు
ABN , First Publish Date - 2023-11-28T13:46:08+05:30 IST
యావత్ దేశం దద్దరిల్లేలా సేలంలో డీఎంకే యువజన విభాగం మహానాడు నిర్వహిద్దామని ఆ విభాగ అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)
అడయార్(చెన్నై): యావత్ దేశం దద్దరిల్లేలా సేలంలో డీఎంకే యువజన విభాగం మహానాడు నిర్వహిద్దామని ఆ విభాగ అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పిలుపునిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. 2007లో ఒకడిగా డీఎంకే యువజన విభాగం బాధ్యతలు చేపట్టానని, అప్పటి నుంచి దశలవారీగా యువజన విభాగాన్ని పటిష్ఠం చేసినట్టు స్టాలిన్ గుర్తు చేశారు. ఆ బాధ్యతలను ఉదయనిధికు అప్పగించానని ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులోభాగంగా, సేలంలో యువజన విభాగ మహానాడును దేశం యావత్ తిరిగి చూసేలా నిర్వహించనున్నారని, దాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.