Share News

Mizoram elections: 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

ABN , First Publish Date - 2023-10-16T14:49:14+05:30 IST

మిజోరం అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే 39 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్‌సవతా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మిజోరంలో రాహుల్ గాంధీ పర్యటన వేళ రాష్ట్ర కాంగ్రెస్ ఈ జాబితాను విడుదల చేసింది.

Mizoram elections: 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీలో ఎన్నికల్లో (Mizoram Assembly elctions) పోటీ చేసే 39 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ (Congress) పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్‌సవతా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మిజోరంలో రాహుల్ గాంధీ పర్యటన వేళ రాష్ట్ర కాంగ్రెస్ ఈ జాబితాను విడుదల చేసింది.


మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కొద్దికాలంగా కోల్పోతూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 40 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 సీట్లు గెలుచుకుని ఉనికిని నిలుపుకొంది. జోరం పీపుల్స్ మూమెంట్ (జేపీఎం) ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుంది. 2018లో ఎన్నికల్లో తొలిసారి అడుగుపెట్టిన జేపీఎం 8 సీట్లు సాధించి, కాంగ్రెస్‌పై పైచేయి సాధించింది. నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ)కు సారథ్యం వహిస్తున్న బీజేపీ స్వంతంత్రంగా ఇప్పటికీ తన ఉనికి చాటుకోలేకపోతోంది. మిజో నేషనల్ ఫ్రంట్ 2018లో 18 సీట్లు గెలుచుకుంది. ఈసారి 25 నుంచి 35 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఉంది. కాగా, దేశంలో ప్రస్తుతం ఒక మహిళ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మిజోరం మాత్రమే.


అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ముఖ్యమంత్రి జోరంతంగా సారథ్యంలోని మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడగా, 20వ తేదీ వరకూ నామినేషన్ల దాఖలు గడువు ఉంది. 21న నామినేషన్ల పరిశీలన, 23తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

Updated Date - 2023-10-16T14:51:25+05:30 IST