Share News

Mizoram elections: 173 నామినేషన్ల చెల్లుబాటు, పెండింగ్‌లో ఒక నామినేషన్

ABN , First Publish Date - 2023-10-22T16:28:27+05:30 IST

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటును ధ్రువీకరించింది. విపక్ష పార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లొర్రయిన్ లాల్‌పెక్లియాన్ నామినేషన్‌లో కొన్ని తేడాలు కనిపించినందున పునఃపరిశీలన చేస్తున్నట్టు కమిషన్ అధికారులు తెలిపారు.

Mizoram elections: 173 నామినేషన్ల చెల్లుబాటు, పెండింగ్‌లో ఒక నామినేషన్

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో (Mizoram Assembly Elections) పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటును ధ్రువీకరించింది. విపక్ష పార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లొర్రయిన్ లాల్‌పెక్లియాన్ నామినేషన్‌లో కొన్ని తేడాలు కనిపించినందున పునఃపరిశీలన చేస్తున్నట్టు కమిషన్ అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో కంటే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తగ్గింది. ఐదేళ్ల క్రితం 212 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి 209 మంది బరిలో నిలిచారు.


ఈసారి ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), విపక్ష జేపీఎం, కాంగ్రెస్ పార్టీ మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. బీజేపీ 23 మంది అభ్యర్థులను పోటీలోకి దింపింది. ఆప్ ఆద్మీ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 27 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఈనెల 23వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2023-10-22T16:30:40+05:30 IST