BJP RSS: బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ కీలక హెచ్చరిక.. ఆ రెండింటినే నమ్ముకుంటే పనికాదని కుండబద్ధలు..!

ABN , First Publish Date - 2023-06-08T19:15:00+05:30 IST

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపికి గట్టిదెబ్బే తగిలిందా? మోదీ మేనియా, హిందూత్వం ఇవేమీ పనిచేయలేదా? 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చిక్కులు తప్పవా? మోదీ ఛరిష్మా, హిందూత్వం అన్ని ఎన్నికల్లో విజయాలు సాధించిపెట్టవని..అరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ ఆర్గనైజర్ బీజేపీని హెచ్చరించడం..ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

BJP RSS: బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ కీలక హెచ్చరిక.. ఆ రెండింటినే నమ్ముకుంటే పనికాదని కుండబద్ధలు..!

ముంబై: కర్ణాటక ఎన్నికల ఫలితాల(Karnataka Election Results)తో బీజేపి(BJP)కి గట్టిదెబ్బే తగిలిందా? మోదీ మేనియా, హిందూత్వం ఇవేమీ పనిచేయలేదా? 2024 లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) బీజేపీకి చిక్కులు తప్పవా? మోదీ ఛరిష్మా, హిందూత్వం అన్ని ఎన్నికల్లో విజయాలు సాధించిపెట్టవని..అరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ (RSS Magazine Organiser) ఆర్గనైజర్ బీజేపీని హెచ్చరించడం..ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రివ్యూ నిర్వహించిన ‘ఆర్గనైజర్’.. కర్ణాటకలో హిందూత్వం, మోదీ మేనియా పనిచేయలేదని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వ్యూహం బీజేపీ ఓటమికి కారణమైందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా.. పక్కా ప్రణాళికతో ముందుకెళితే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి ఇదే సరియైన సమయం అని ఇప్పుడు మేలుకోకపోతే అంచనాలు తారుమారు కావొచ్చని ఆర్గనైజర్ హెచ్చరించింది.

ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక మ్యాగజైన్ ఆర్గనైజర్ ప్రకారం..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆ పార్టీ నేతల అవినీతే ప్రధాన కారణమని.. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మొదటిసారి బీజేపీ అవినీతిని సమర్థించుకోవాల్సి పరిస్థితి ఏర్పిడింది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలతో కర్ణాటక ప్రజలను ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేసింది. అత్యధిక శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో ఓట్లను రాబట్టడంలో బీజేపీ పూర్తిగా విఫలం కావడం..సిట్టింగ్ మంత్రులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి ఆందోళన కలిగించే అంశమని ఆర్గనైజర్ తెలిపింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయస్థాయి నేతలు కీలకపాత్ర పోషించింది. ఎన్నికల ప్రచారంలో లోకల్ లీడర్లను వినియోగించుకోవడంలో సక్సెస్ సాధించిన కాంగ్రెస్ భారీవిజయాన్ని సాధించింది. ఓ కుటుంబం నడిపిస్తున్నపార్టీ.. ఈ ఎన్నికల్లో ఐకమత్యాన్ని చాటడమే కాకుండా.. 2018 ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే 5 శాతం ఓట్లను అధికంగా సాధించగలిగింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన పెద్ద పెద్ద హామీల ఎలా నెరవేర్చుతుందో.. కాంగ్రెస్ ఎంతకాలం స్థిరమైన పరిపాలన అందిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆర్గనైజర్ తెలిపింది.

కర్ణాటక ఎన్నికల్లో కుల సమీకరణ నిర్మోహమాటంగా జరిగిందని తేలిపోయింది. ఉత్తర, దక్షిణ భారతం అంటూ ఓ వైపు.. భాషా పునర్వవస్థీకరణ అంటూ మరోవైపు ఓట్లను దండుకున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని ఆర్గనైజర్ ఆరోపించింది. ఇటువంటి దీర్ఘకాలిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండానే బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే ఆ పార్టీ ఓటమికి కారణమని పేర్కొంది.

“ఓట్లను సంపాదించడంలో మతపరమైన గుర్తింపు పాత్ర కీలకంగా మారింది. మతం కూడా బీజేపీ ఓటమికి మరో కారణమని.. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు కర్ణాటక ముస్లిం నేతలు ఏకమై కాంగ్రెస్‌కు ఓట్లు వేయడం..నర్మగర్భంగా క్రిస్టియన్లు చేతులు కలపడంతో కాంగ్రెస్‌ విక్టరీ సాధించిందని ఆర్గనైజర్ వెల్లడించింది.

పక్కా ప్రణాళికతో ముందుకెళితే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉందని.. బీజేపీకి ఇదే సరియైన సమయం.. ఇప్పుడు మేలుకోకపోతే అంచనాలు తారుమారు కావొచ్చని ఆర్గనైజర్ హెచ్చరించింది.

Updated Date - 2023-06-08T19:23:25+05:30 IST