Movie actor: ‘కావేరి’ విషయంలో మాకు ప్రతీసారి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది...
ABN , First Publish Date - 2023-09-27T12:23:31+05:30 IST
కావేరి కన్నడిగుల జీవనాడిగా ఉందని ప్రజాక్రోశాన్ని గమనించి ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతుల ప్రయోజనాలను
- కన్నడిగుల జీవనాడి ‘కావేరి’
- నటుడు వెంకటరాజు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి కన్నడిగుల జీవనాడిగా ఉందని ప్రజాక్రోశాన్ని గమనించి ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలని ప్రముఖ నటుడు వెంకటరాజు(Actor Venkataraju) విజ్ఞప్తి చేశారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కావేరి జలాల విషయంలో ప్రతీసారి కన్నడిగులకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కావేరి వివాద విషయంలో ప్రధాని తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. కావేరి విషయంలో రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనే ఏకైక లక్ష్యంగా పార్టీలన్నీ కల్సికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో వర్షాభావ స్థితికి తోడు కావేరి జలవివాదం రైతాంగాన్ని కష్టాల ఊబిలోకి నెట్టేయడం బాధగా ఉందన్నారు.