Share News

MP Kanimozhi: ఎంపీ కనిమొళి ఆసక్తికర కామెంట్స్.. బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆశలు ఫలించవులే...

ABN , First Publish Date - 2023-11-09T12:52:53+05:30 IST

రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆశలు ఫలించవని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)

MP Kanimozhi: ఎంపీ కనిమొళి ఆసక్తికర కామెంట్స్.. బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆశలు ఫలించవులే...

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆశలు ఫలించవని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు. తూత్తుకుడిలో బుధవారం మత్స్యకారులకు రుణాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కనిమొళి మాట్లాడుతూ... బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే హిందూ దేవాదాయ శాఖను రద్దు చేస్తామని, ప్రజాభీష్టం మేరకు ఈ చర్యలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మంగళవారం ప్రకటించినట్లు తెలిసిందని, అసలు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడితేనే కదా దేవాదాయ శాఖను రద్దు చేసేది, ఆయన ఆశలు రాష్ట్రంలో నెరవేరే అవకాశం లేదని ఎంపీ కనిమొళి తెలిపారు.

Updated Date - 2023-11-09T12:52:54+05:30 IST