Nitin Gadkari : ఆరు నెలల్లో టోల్ ప్లాజాలకు చెల్లు చీటీ
ABN , First Publish Date - 2023-03-24T18:56:32+05:30 IST
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, టోల్ వసూలు ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ : దేశంలోని హైవేలపైగల టోల్ ప్లాజాలకు బదులుగా జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) శుక్రవారం చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం, వాహనదారులు ప్రయాణించిన దూరానికి మాత్రమే కచ్చితంగా టోల్ వసూలు చేయడం వంటివాటి కోసం నూతన టెక్నాలజీలను మరో ఆరు నెలల్లోగా ప్రవేశపెడతామని చెప్పారు.
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, టోల్ వసూలు ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి ప్రస్తుతం రూ.40 వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఈ ఆదాయం రానున్న రెండు, మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలకు బదులుగా జీపీఎస్ బేస్డ్ టోల్ సిస్టమ్స్ సహా నూతన టెక్నాలజీలను ప్రవేశపెడతామన్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వాహనాలను నిలపవలసిన అవసరం లేకుండానే టోల్‌ను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టును రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందన్నారు.
2018-19లో వాహనాలు టోల్ ప్లాజా వద్ద సగటున ఎనిమిది నిమిషాలపాటు వేచి ఉండవలసి వచ్చేది. ఫాస్టాగ్స్ వచ్చిన తర్వాత 2020-21, 2021-22లో సగటున 47 సెకండ్లు వేచి ఉండవలసి వస్తోంది.
ఇవి కూడా చదవండి :
CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..
World TB Summit : క్షయ వ్యాధిపై సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు