INDIA Name: విపక్ష ఫ్రంట్ పేరుపై నితీష్ కోపం ఉత్తదేనట..!

ABN , First Publish Date - 2023-07-19T17:14:06+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు జాతీయ అభివృద్ధి సమ్మళిత కూటమి (ఇండియా) పేరు విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారంటూ వచ్చిన ఊహాగానాలను జేడీయూ నేతలు కొట్టిపారేశారు. విపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించిన వారిలో నితీష్ ఒకరని, ఆయనకు ఎలాంటి ఆగ్రహం లేదని తెలిపారు.

INDIA Name: విపక్ష ఫ్రంట్ పేరుపై నితీష్ కోపం ఉత్తదేనట..!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు జాతీయ అభివృద్ధి సమ్మళిత కూటమి (INDIA) పేరు విషయంలో నితీష్ కుమార్ (Nitish Kumar) అసంతృప్తితో ఉన్నారంటూ వచ్చిన ఊహాగానాలను జేడీయూ (JDU) నేతలు కొట్టిపారేశారు. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు లలన్ సింగ్ యాదవ్ మీడియాకు వివరణ ఇచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించిన వారిలో నితీష్ ఒకరని, ఆయనకు ఎలాంటి ఆగ్రహం (పేరు విషయంలో) లేదని తెలిపారు. ఎన్డీయేలో తాను ఐదేళ్లు ఉన్నానని, ఇంతవరకూ ఒక్కసారి కూడా ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయని ప్రధానమంత్రి మోదీ ఇప్పుడే ఎందుకు ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు.


బెంగళూరులో సోమ, మంగళవారంలో జరిగిన విపక్ష సమావేశాలు జరిగిన తీరు, చోటుచేసుకున్న పరిణామాలపై భాగస్వామ్య పార్టీల నుంచి హర్షం వ్యక్తం కాగా, విపక్ష కూటమిలో లేని పార్టీల నుంచి సహజంగానే పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.


కూటమి పేరుపై ఎలాంటి విభేదాలు లేవు: సంజయ్ రౌత్

విపక్ష కూటమికి భారత జాతీ అభివృద్ధి సమ్మిళిత కూటమి (INDIA) పేరు విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవని ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. నరేంద్ర మోదీ మద్దతుదారులు మాత్రం మోదీ అంటేనే ఇండియా అంటూ ప్రచారం సాగిస్తుంటారని, ఇండియా అంటే ఆయన ఒక్కడే కాదని, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇండియా చెందుతుందని అన్నారు.


ఇండియాను విడగొట్టడం బీజేపీకి కుదరదు: సూర్జేవాలా

విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయంటూ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తాము సమర్ధిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. 'ఇండియా'ను విభజించాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సక్సె్స్ కాలేదని ఆయన చెప్పారు.


ఎన్డీయేపై ఇప్పుడే కేంద్రానికి ప్రేమ పుట్టుకొచ్చిందా?: రాఘవ్ చద్దా

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా విమర్శలు గుప్పించారు. కేంద్రం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. గత తొమ్మిదేళ్లపై ఒక్కసారి కూడా ఎన్‌డీఏ సమావేశం జరపలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా మధ్యేనని, ఇండియా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. INDIA పేరు చాలా మంచి పేరు అని, ఆ పేరును ఎవరు ప్రతిపాదించారనేది ఇక్కడ మఖ్యం కాదని చెప్పారు.


బీజేపీలో బెదురు మొదలైంది: ప్రమోద్ తివారీ

బీజేపీ మేక్ ఇన్ ఇండియా, షైనింగ్ ఇండియా అంటూ ఎన్నో స్కీమ్‌లు తెచ్చిందని, ఇప్పుడు ఇండియా (విపక్ష కూటమి పేరు)పై అనవసరమైన వివాదం రేపుతోందని కాంగ్రెస్ నేత ప్రమోద్ తీవారీ తప్పుపట్టారు. తాము (విపక్ష కూటమి) ఇంకా కలిసికట్టుగా పని మొదలుపెట్టకుండానే బీజేపీలో బెదురు మొదలైందని అన్నారు.


మాయవతి మండిపాటు

పాట్నా, బెంగళూరులో విపక్షాలు జరిగిన రెండు సమావేశాలకు గైర్హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. భావసారూప్యం కలిగిన కుల, క్యాపిటలిస్ట్ పార్టీలతో కూటమిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ పార్టీలు ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా దళితులు, ముస్లింలు, మైనారిటీలకు చేసినదేమీ లేదన్నారు. అందరూ ఒకటేనని, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోతుంటారని అన్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరూ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని ఆమె విమర్శించారు. విపక్షాలతో తాము చేతులు కలపకపోవడానికి ఇదే అది పెద్ద కారణమని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-07-19T17:15:45+05:30 IST