Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

ABN , First Publish Date - 2023-10-04T13:34:09+05:30 IST

బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.

Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన ప్రారంభించిన అధికారులు

భువనేశ్వర్: బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వెనకబడిన తరగతుల జనాభా గణనకు పూనుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా సర్వే చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ(OBC) గణనపై తమ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉందని బిజు జనతాదళ్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.


అస్సాం సైతం ఆ రాష్ట్రంలోని మైనార్టీల(ముస్లిం) జన గణనను చేపట్టింది. తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని సీఎం హిమంత బిస్వ శర్మా(Himanta Biswa Sarma) పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక గుర్తింపు, విద్య, ఆర్థిక అంశాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత తదితర అంశాల్లో వారి అభివృద్ధికి ఈ సర్వే తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే టైంలో బిహార్ ప్రభుత్వం కుల గణన సర్వే నివేదిక విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఆ సర్వే ప్రకారం.. బిహార్ లో 63 శాతం జనాభా ఓబీసీ, ఈబీసీ(EBC)లే ఉన్నారు. ఒడిశా(Odisha)లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక మిగతా రాష్ట్రాలపై సైతం కుల గణన చేయాలని ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది.

Updated Date - 2023-10-04T13:34:52+05:30 IST