Home » Naveen Patnaik
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు.
బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టంచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కేసీఆర్ రెండు చోట్ల(గజ్వేల్, కామారెడ్డి) పోటీ చేసిన మాదిరిగానే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా రెండు స్థానాల్లో(హింజిలీ, కాంతాబంజీ) పోటీ చేశారు. అయితే సిట్టింగ్ స్థానం హింజిలీలో నవీన్ గెలుపొందారు. కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్‌పై 16,334 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఒడిశా అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బుధవారంనాడు అభినందనలు తెలిపారు.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.