INS Vikrant : ఐఎన్ఎస్ విక్రాంత్‌కు విశిష్ట బహుమతి
ABN , First Publish Date - 2023-04-09T21:49:17+05:30 IST
మన దేశపు మొట్ట మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)కు అత్యంత అరుదైన బహుమతి లభించింది.
న్యూఢిల్లీ : మన దేశపు మొట్ట మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)కు అత్యంత అరుదైన బహుమతి లభించింది. ఇదే పేరుతో 1961లో నౌకా దళంలో చేరిన మొదటి విమాన వాహక నౌకకు అమర్చిన ఒరిజినల్ గంట (Bell) మళ్లీ దీనికి వచ్చింది. దీనిని ఇటీవలే రిటైరైన వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మాడే బహూకరించారు. దీనిని ఐఎన్ఎస్ విక్రాంత్ కమాండింగ్ ఆఫీసర్ మార్చి 22న స్వీకరించారు. ఈ వివరాలను నావికా దళం ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ గంటను విక్రాంత్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రస్తుత, భవిష్యత్తు నావికా దళాధికారులకు గొప్ప ప్రేరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ యుద్ధ నౌక చరిత్రను అధికారులు, సెయిలర్లు తెలుసుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
బ్రిటన్‌కు చెందిన విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ హెర్క్యులెస్‌ను మన దేశం కొనుగోలు చేసి, ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టి, 1961లో నావికా దళంలో ప్రవేశపెట్టింది. ఈ గంటను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. అదే గంటను ప్రస్తుతం మన దేశంలోనే తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌కు బహుమతిగా ఇచ్చారు. పాత నౌకను 1997లో డీకమిషన్ చేశారు. దానిలోని గంటను తొలగించి 5, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఇండియన్ నేవీ వైస్ చీఫ్ డిజిగ్నేటెడ్ రెసిడెన్స్‌లో ఉంచారు.
ఇవి కూడా చదవండి :
PM Modi : ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ జంట బొమ్మన్, బెల్లీలతో మోదీ మాటమంతి
Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ