Delhi Rains:ఊపిరి పీల్చుకున్న రాజధానివాసులు.. వర్షాలతో తగ్గిన పొల్యూషన్
ABN , First Publish Date - 2023-11-10T08:04:14+05:30 IST
రెండు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్య సమస్య వేధిస్తోంది. వారికి ఉపశమనం కలిగించాయి వర్షాలు. గత రాత్రి ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రిపూట వర్షం కురవడంతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు(Weather Scientist) చెబుతున్నారు.
ఢిల్లీ:రెండు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్య సమస్య వేధిస్తోంది. వారికి ఉపశమనం కలిగించాయి వర్షాలు. గత రాత్రి ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రిపూట వర్షం కురవడంతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు(Weather Scientist) చెబుతున్నారు. నోయిడా, గురుగ్రామ్,ఎన్సీఆర్(NCR)లోని చాలా ప్రాంతాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది.ఇవాళ మరిన్ని వర్షాలు(Rains) కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు వాయునాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని వెల్లడించారు. నగరంలో తీవ్ర వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్ 20-21 తేదీల్లో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలన్న ఢిల్లీ ప్రభుత్వ యోచిస్తోంది. ఈ టైంలో వర్షాలు కురవడం కాస్తంత రిలీఫ్‌నిచ్చింది.
వాయునాణ్యత సూచి(AQI) చాలా చోట్ల 400 పాయింట్లకు పైగా ఉండగా.. రాత్రి ఆ విలువ 100కు పడిపోయింది. వాయు కాలుష్యం గుప్పిట నుంచి విడిపించేందుకు అక్కడి సర్కారు మేఘ మథనానికి సిద్ధమయింది. క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ద్వారా కృతిమంగా వర్షాన్ని కురిపించి ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని కేజ్రీవాల్ సర్కార్ భావిస్తోంది. క్లౌడ్‌సీడింగ్(Cloud Seeding) ప్రక్రియలో భాగంగా మేఘాలలో కొన్ని లవణాల మిశ్రమాన్ని స్ప్రే చేసి వర్షం కురిసేలా చేస్తారు. గాలిలో ఉన్న ధూళి కణాలు వర్షం వల్ల భూమికి చేరి పర్యావరణం కాలుష్య రహితం అవుతుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నిపుణులతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేపట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించిన పలు పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) ముందున్న నేపథ్యంలో క్లౌడ్ సీడింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ టైంలోనే వర్షం కురవడం కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చింది.