Naroda Gam massacre: నరోదాగామ్ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఒవైసీ సంచలన ట్వీట్
ABN , First Publish Date - 2023-04-21T07:52:47+05:30 IST
నరోదాగామ్ ఊచకోత కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సంచలన ట్వీట్....
హైదరాబాద్: నరోదాగామ్ ఊచకోత కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సంచలన ట్వీట్ చేశారు.(MP Asaduddin Owaisi) అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు గురువారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, భజరంగ్‌దళ్ మాజీ నాయకుడు బాబు భజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.నరోదా పాటియా ఊచకోత కేసులో(Naroda Gam massacre) మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై అసదుద్దీన్ స్పందించారు.మజ్లిస్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ దివంగత కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ( Owaisi quotes Rahat Indori) గుజరాత్‌లోని అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి : Poonch Terror Attack: ఉగ్ర దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీరులో హై అలర్ట్
‘‘మీరు వెళ్లి నిప్పు పెడతారు, మీరు ఎక్కడికి వెళ్లినా గందరగోళాన్ని సృష్టిస్తారు...పచ్చని పంట భూమిలో రక్తం చిందించే హక్కు రాజకీయాలు మీకు కల్పించాయి. మీరు అప్పీలు చేస్తారు, మీరు కేసు వాదిస్తారు, మీరే సాక్షి,మీరే న్యాయవాది. ఎవరినైనా చెడుగా మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉంది, ఎవరినైనా చంపడానికి మీకు స్వేచ్ఛ ఉంది’’అని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన కొన్ని గంటల తర్వాత గురువారం ఒంటిగంటకు ఒవైసీ ట్వీట్ చేశారు.