Hinduphobia : అమెరికాలో హిందూ ఫోబియాపై ‘పాంచజన్య’ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-08T19:53:00+05:30 IST

భారతీయ ప్రతిభావంతులు అమెరికాలో అభివృద్ధి చెందుతున్నారని, వారిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

Hinduphobia : అమెరికాలో హిందూ ఫోబియాపై ‘పాంచజన్య’ ఆగ్రహం
Seattle City Council

న్యూఢిల్లీ : భారతీయ ప్రతిభావంతులు అమెరికాలో అభివృద్ధి చెందుతున్నారని, వారిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అనుబంధ పత్రిక ‘పాంచజన్య’లో ప్రచురితమైన ఓ వ్యాసం ఆరోపించింది. ఇటీవల అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ వివక్ష నిరోధక చట్టాలు (anti-discrimination laws)లో ‘కులం’ను చేర్చడాన్ని దీనికి ఉదాహరణగా తెలిపింది. అమెరికాలో హిందూ ఫోబియా (Hinduphobia) సంస్థాగతంగా ప్రమోట్ అవుతోందని పేర్కొంది.

‘పాంచజన్య’ (Panchjanya) సంపాదకుడు హితేష్ శంకర్ ఈ వ్యాసాన్ని రాశారు. కుల వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా సియాటెల్ సిటీ కౌన్సిల్ ఓ విషయాన్ని రుజువు చేసిందని పేర్కొన్నారు. హిందూ ఫోబియాకు అమెరికాలో సంస్థాగత స్థాయిలో ప్రోత్సాహం లభిస్తోందని ఈ తీర్మానం ద్వారా రుజువైందని తెలిపారు. వివక్ష నిరోధక చట్టాల పేరుతో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉన్న హిందువుల పట్ల వివక్ష ప్రదర్శించడమేనని పేర్కొన్నారు. అమెరికాలో మైనారిటీలైన హిందువులు శాంతి, సామరస్యాలుగలవారని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసునని, అలాంటివారిని తనిఖీలు, దర్యాప్తులకు నిలబెట్టారని పేర్కొన్నారు. హిందూ ఫోబియా వేగంగా విస్తరిస్తోందని, దీని కోసం నిధులు కూడా సమకూరుతున్నాయని, ఇది సంస్థాగత రూపంలో ఉండటం ప్రమాదకరమని, ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Karnataka : నోట్ల కట్టలతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యేపై అధిష్ఠానం ఆగ్రహం!

DU women’s hostel : హోళీ సంబరాలపై ఆంక్షలు... ఢిల్లీ విద్యార్థినుల నిరసన...

Updated Date - 2023-03-08T19:59:13+05:30 IST