Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ దుమారంలో ట్విస్ట్.. సుప్రీం కోర్టుకు పంచాయితీ !
ABN , First Publish Date - 2023-05-25T13:57:20+05:30 IST
కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్‌ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలాఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారన్నవార్తలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించాయి.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్(New Parliament)ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా(Inaugurate) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభిస్తారన్నవార్తలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి(President of India) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించాయి. ఇలా చేయడమంటే రాష్ట్రపతిని అవమానించినట్లేనని విపక్ష నేతలు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో.. 28న (ఆదివారం) జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ కాంగ్రెస్ సహా 19 పార్టీలు సంయుక్త ప్రకటన జారీ చేశాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి), ఆర్‌ఎస్‌పీ, వీసీకే, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌డీ పార్టీలు ఈ ప్రకటనపై సంతకం చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ అని అర్థమని.. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాక పార్లమెంట్‌లో సమగ్రభాగమని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో గుర్తుచేశాయి.