Share News

Modi campaign cancel: మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమం రద్దు

ABN , First Publish Date - 2023-10-28T20:50:47+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మిజోరంలోని మమిత్ లో అక్టోబర్ 30న జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. మోదీకి బదులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మమిత్‌లో ప్రచారం చేపడతారని పార్టీ ప్రతినిధి తెలిపారు.

Modi campaign cancel: మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమం రద్దు

ఐజ్వాల్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మిజోరం (Mizoram)లోని మమిత్ (Mamit)లో అక్టోబర్ 30న జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొనాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. మోదీకి బదులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) మమిత్‌లో ప్రచారం చేపడతారని, అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ మీడియా కన్వీనర్ జానీ లాల్‌థన్‌పుఇయా శనివారంనాడు తెలిపారు.అయితే మోదీ పర్యటన రద్దుకు కారణం ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. బీజేపీ మరో సీనియర్ నేత నితిన్ గడ్కరి సైతం సోమవారంనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.


రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాల్లో ఉండే చక్మ, బ్రూ, మార, లయి కమ్యూనిటీ ప్రజల ఓట్లపై కన్నేసిన బీజేపీ ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా గత ఈనెల 27న పార్టీ మేనిఫెస్టోను విడుదలచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, అసోంతో ఉన్న చిరకాల సరిహద్దు సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీలిచ్చింది. ఈసారి ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రధాన విపక్షమైన జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జడ్‌పీఎం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ తొలిసారి 4 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. నవంబర్ 7న ఒకే విడతలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతావు.

Updated Date - 2023-10-28T20:50:47+05:30 IST