Modi UAE Visit : అబుదాబి వచ్చానంటూ మోదీ ట్వీట్
ABN , First Publish Date - 2023-07-15T15:50:15+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించిన అనంతరం ఆయన శనివారం అబుదాబి చేరుకున్నారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ స్వాగతం పలికారు.
అబుదాబి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించిన అనంతరం ఆయన శనివారం అబుదాబి చేరుకున్నారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ స్వాగతం పలికారు. కస్ర్ అల్ వటన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
మోదీ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, COP28 ప్రెసిడెంట్ డిజిగ్నేట్ డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధిని మరింత విస్తృతం చేయడంపై తాము దృష్టి పెట్టామన్నారు. మిషన్ లైఫ్ (LiFE)పై భారత దేశం చాలా శ్రద్ధ చూపుతోందని, సుస్థిర అభివృద్ధి కోసం భారత దేశం చాలా కృషి చేస్తోందని తాను చెప్పినట్లు తెలిపారు.
మోదీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. ఇంధనం, ఆహార భద్రత, రక్షణ రంగంలో సహకారంపై ఈ ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఫ్రాన్స్, యూఏఈ పర్యటనకు బయల్దేరే ముందు మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, నా మిత్రుడు, యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్‌తో చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు.
అబుదాబి చేరుకున్న వెంటనే మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, తాను అబుదాబి చేరుకున్నానని, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్‌తో చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఈ చర్చలు భారత్-యూఏఈ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, ఫిన్‌టెక్, రక్షణ, భద్రత రంగాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ
Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు