Share News

PM Modi security lapse: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం..బటిండా ఎస్‌పీపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2023-11-25T15:33:13+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 5న పంజాబ్‌ లో జరిపిన పర్యటనలో భద్రతా లోపంపై బడిండా ఎస్‌పీ గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది.

PM Modi security lapse: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం..బటిండా ఎస్‌పీపై సస్పెన్షన్ వేటు

ఛండీగఢ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2022 జనవరి 5న పంజాబ్‌ (Punjab)లో జరిపిన పర్యటనలో భద్రతా లోపం (Security lapse)పై బడిండా (Bathinda) ఎస్‌పీ గుర్వీందర్ సింగ్ సంఘా (Gurwinder Singh Sangha)ను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది. ఫెరోజ్‌పూర్‌లో ఎస్‌పీ ఆపరేషన్స్‌ కోసం నియమించిన గుర్విందర్ సింగ్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.


భద్రతా వైఫల్యం ఇలా..

ప్రధానమంత్రి 2022 జనవరి 5న ఫెరోజ్‌పూర్ నుంచి హుస్సైనివాలా వెళ్తుండగా భద్రతా లోపం తలెత్తింది. ఉదయం 5 గంటలకు బటిండా చేరిన ప్రధాని అక్కడి నుంచి హుస్సైనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో మోదీ ప్రయాణించారు. అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లై ఓవర్ దగ్గరకు ఆయన కాన్వాయ్ వచ్చేసరికి కొందరు ఆందోళనకారులు రోడ్లును దిగ్బంధం చేశారు. దీంతో ఫ్లై ఓవర్ పైనే ప్రదాని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ముందుగా అనుకున్న కార్యాక్రమానికి, ర్యాలీకి హాజరుకాకుండానే పంజాబ్‌ నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. 2022 జనవరిలో కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై పలువురు రాష్ట్ర అధికారులను సుప్రీంకోర్టు నియామక కమిటీ తప్పుపట్టింది. 22 నెలల అనంతరం దీనిపై పంజాబ్ సర్కార్ చర్య తీసుకుంటూ బటిండా ఎస్‌పీని సస్పెండ్ చేసింది.

Updated Date - 2023-11-25T15:33:14+05:30 IST