Modi host dinner: జి-20 విజయోత్సవ విందుకు మోదీ ఆతిథ్యం

ABN , First Publish Date - 2023-09-22T18:35:38+05:30 IST

జి-20 సదస్సు హస్తినలో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన 2,500 మంది అధికారులు, సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం డిన్నర్ ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన 22 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ విందులో పాల్గోనున్నారు.

Modi host dinner: జి-20 విజయోత్సవ విందుకు మోదీ ఆతిథ్యం

న్యూఢిల్లీ: జి-20 సదస్సు (G-20 Summit) హస్తినలో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన 2,500 మంది అధికారులు, సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం డిన్నర్ ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన 22 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ విందులో పాల్గోనున్నారు. వీరిలో విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన 700 మంది సిబ్బంది, 300 మంది ఢిల్లీ పోలీసులు, ఎస్‌పీజీపీ, రాజ్‌ఘాట్, సీఐఎస్ఎఫ్, ఐఏఎఫ్, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సీపీలు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొంటారని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ''వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్'' అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సులో జీ-20 గ్రూప్‌లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-09-22T18:35:38+05:30 IST