Home » G-20 leadership summit
ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఇటలీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోదీ కలుసుకోనున్నారు.
జి-20 సదస్సు హస్తినలో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన 2,500 మంది అధికారులు, సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం డిన్నర్ ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన 22 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ విందులో పాల్గోనున్నారు.
ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన 'జి-20' సదస్సు విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ఢిల్లీ పోలీసు అధికారుల గౌరవార్దం ఈనెల 16న 'విందు' కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
విపక్ష కూటమి 'ఇండియా' ఏర్పాటుకు అనుసంధానకర్తగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20 ) విందు సమావేశానికి హాజరయ్యారు. ఈ చర్య నితీష్ చాణక్య నీతికి నిదర్శనమని, 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' కొట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జి-20 సదస్సు ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్ధం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఇస్తున్న విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఆయన గైర్హాజరు వెనుక ఇతమిద్ధమైన కారణాన్ని తెలియజేయలేదు.
ప్రపంచ అధినేతలను స్వాగతించేందుకు జీ-20 వేదిక అయిన దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. అగ్రదేశాల నేతల కోసం హోటళ్లన్నీ బుక్ ,..
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశం అధ్యక్షతన జి-20 సదస్సు జరుగుతోందనడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రొటేషనల్ పద్ధతిలో జి-20 ప్రెసిడెన్సీ ఉంటుందనే విషయం ఆయన (మోదీ) మరచిపోరాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేర అన్నారు.
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల (Narendra Modi) భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి (Bali) వేదికగా నవంబర్లో జరగనున్న జీ-20 లీడర్షిప్ సమ్మిట్లో (G-20 leadership summit) ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు.