Republic day: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-01-26T09:12:08+05:30 IST
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న దేశవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ( Republic day celebrations) జరుపుకుంటున్న శుభసందర్భంగా దేశవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే ఉమ్మడిగా ముందుకుసాగాలని దేశవాసులకు సందేశమిచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘‘ భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు.
ఈ రిపబ్లిక్ ప్రత్యకతలు ఇవే..
1. గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతియేటా నిర్వహించే వేదిక, బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌ను (Rajpath) పునరుద్ధరణ తర్వాత ‘కర్తవ్య పథ్’గా (Kartavya Path) పేరు మార్చారు. ఈ కర్తవ్య పథ్‌పైగా తొలిసారిగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
1. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి (Abdel Fattah El-Sisi) పాల్గొంటున్నారు.
3. కర్తవ్య పథ్‌లో జరగనున్న వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6 మంత్రిత్వశాఖలు, విభాగాలు పాల్గొననున్నాయి. దేశ శక్తిసామర్థ్యాలు, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వృద్ధి, మహిళాసాధికారిత వంటి విభిన్న అంశాలను వేడుకల్లో ప్రతిబింబించనున్నాయి.
4. వందేభారతం డ్యాన్స్ కాంపిటీషన్ కోసం దేశవ్యాప్తంగా 479 మంది కళాకారులను ఎంపిక చేశారు. ఈ బృందం ప్రదర్శన చేయనుంది.
5.రాష్ట్రపతికి 21-గన్ సెల్యూట్ సమర్పించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఫీల్డ్ ఫిరంగి స్థానంలో దేశీయంగా తయారు చేసిన ఫిరంగిని ప్రవేశపెట్టనున్నారు.
6.భారత తొలి ప్యాసింజర్ డ్రోన్ ప్రదర్శన
7.ప్రపంచంలోనే తొలి మహిళా ‘ఒంటెల రైడర్ల’ (Camel riders) ప్రదర్శన చేయనుంది.
8.ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గరుడ్ కమాండోస్ తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నాయి.