President: రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్
ABN , First Publish Date - 2023-07-01T12:30:58+05:30 IST
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 2న జరిగే
- ప్రకటించిన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 2న జరిగే 18వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శరణప్ప వీ హళస తెలిపారు. శుక్రవారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయురాలిగా జీవనాన్ని ప్రారంభించిన ఆదివాసీ మహిళ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించామన్నారు. విద్యారంగానికి ఎంతో సేవ చేసిన ఎన్ రామచంద్రకు వైద్య, ఆరోగ్య విభాగంలో ఉన్నత సేవలు కొనసాగించిన వెంకటలక్ష్మి నరసింహరాజుకు డాక్టరేట్‌ను ప్రకటించామన్నారు. స్నాతకోత్సవంలో పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను పొందాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరామని తెలిపారు. ఒకవేళ ఆమె హాజరు కానిపక్షంలో 3న రాష్ట్రపర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ప్రదానం చేస్తామన్నారు. స్నాతకోత్సవంలో పొలిటికల్ సైటిన్స్‌లో ఓ మహిళకు పీహెచ్‌డీ ప్రదానం చేస్తున్నామని, 7,057 మందికి డిగ్రీ, 1664 మందికి పీజీ పట్టాలు ప్రదానం చేస్తామని తెలిపారు. 46 మందికి బంగారం, 27 మందికి నగదు బహుమతులు ప్రదానం చేస్తామని వివరించారు.