Priyanka Gandhi: ప్రియాంకగాంధీ పీఏపై బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్ కేసు

ABN , First Publish Date - 2023-03-08T08:32:54+05:30 IST

బిగ్ బాస్-16 టాప్ 5 ఫైనలిస్ట్ అర్చన గౌతమ్ తండ్రి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్సనల్ అసిస్టెంట్ సందీప్ కుమార్‌పై కేసు...

Priyanka Gandhi: ప్రియాంకగాంధీ పీఏపై బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్ కేసు
Priyanka Gandhi's PA Misbehaved With Archana

రాయ్‌పూర్‌: బిగ్ బాస్-16 టాప్ 5 ఫైనలిస్ట్ అర్చన గౌతమ్ తండ్రి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్సనల్ అసిస్టెంట్ సందీప్ కుమార్‌పై కేసు పెట్టారు.(Priyanka Gandhi PA Threatened)ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌కు హాజరయ్యేందుకు గత నెల 26వతేదీన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు తన కుమార్తె అర్చనా(Bigg Boss 16 Fame Archana Gautam) వెళ్లిందని ఆమె తండ్రి గౌతమ్ బుద్ చెప్పారు.తన కూతురు అర్చనాను ప్రియాంక గాంధీకి పరిచయం చేసేందుకు పీఏ సందీప్ కుమార్ నిరాకరించాడని, దీంతోపాటు అర్చనతో అసభ్యంగా(Misbehaved) మాట్లాడి చంపేస్తానని బెదిరించాడని అర్చనా గౌతమ్ తండ్రి గౌతం బుధ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Egypt : పట్టాలు తప్పిన రైలు...ఇద్దరి మృతి, 16మందికి గాయాలు

తన కుమార్తెను ప్రియాంక పీఏ సందీప్ కులంపేరుతోనూ దూషించాడని గౌతమ్ ఫిర్యాదు చేశారు. అర్చన గౌతమ్ స్వయంగా ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పారు. దీనిపై మీరట్ పోలీసులు సందీప్ సింగ్‌పై పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 504, 506,ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మీరట్ సిటీ ఎస్పీ పీయూష్ సింగ్ తెలిపారు.బిగ్ బాస్ 16వ సీజన్‌లో అర్చన గౌతం శివ్ ఠాకరేతో గొడవ పడింది. దీంతో ఆమెను బిగ్ బాస్ నుంచి బహిష్కరించారు.ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఆమెను బిగ్ బాస్ ఇంటికి తీసుకొచ్చారు.

Updated Date - 2023-03-08T09:08:23+05:30 IST