Puducherry to Tirupati: పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సర్వీసు

ABN , First Publish Date - 2023-09-06T13:32:36+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సేవలు ప్రారంభమైనట్లు పుదుచ్చేరి ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది.

Puducherry to Tirupati: పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సర్వీసు

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సేవలు ప్రారంభమైనట్లు పుదుచ్చేరి ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది. మంగళవారం ఉదయం 9 గంటలకు పుదుచ్చేరిలో తొలి సర్వీసు బయలుదేరింది. తిరిగి అదే బస్సు రాత్రి 10 గంటలకు తిరుపతి నుంచి పుదుచ్చేరికి బయలుదేరుతుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి రూ.255గా టిక్కెట్‌ ధర నిర్ణయించారు. రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-06T13:32:36+05:30 IST