Bharat Jodo Yatra: పాదయాత్రలో తొలిసారి బ్లాక్ జాకెట్ ధరించిన రాహుల్

ABN , First Publish Date - 2023-01-20T15:34:33+05:30 IST

'భారత్ జోడో యాత్ర' తుది దశకు చేరుకుంది. ఇంతవరకూ రాహుల్ దేశవ్యాప్త పాదయాత్రలో చలిగాలులను కూడా.. లెక్కచేయకుండా కేవలం

Bharat Jodo Yatra:  పాదయాత్రలో తొలిసారి బ్లాక్ జాకెట్ ధరించిన రాహుల్

శ్రీనగర్: 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) తుది దశకు చేరుకుంది. ఇంతవరకూ రాహుల్ దేశవ్యాప్త పాదయాత్రలో చలిగాలులను కూడా లెక్కచేయకుండా కేవలం తెలుపురంగు టీషర్ట్‌‌తో పాల్గొంటూ వచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశం కూడా అయింది. అయితే, తొలిసారిగా రాహుల్ శుక్రవారంనాడు నలుపురంగు రెయిన్ కోట్ వేసుకుని పాదయాత్రలో కనిపించారు. గురువారంనాడు పంజాబ్‌ నుంచి జమ్మూ చేరుకున్న పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైనప్పుడు రాహుల్ కొద్దిసేపు బ్లాక్ జాకెట్ వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, తీవ్రమైన మంచు, శీతాకాలం జల్లుల కారణంగా గంట ఆలస్యంగా మొదలైంది. దీంతో బ్లాక్ జాకెట్ వేసుకున్న రాహుల్, ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని తీసివేసి, ట్రెడిషనల్ టీ షర్ట్‌తోనే ముందుకు సాగారు.

కతువాలోని హట్లీ మోడ్‌ నుంచి జమ్మూలోని చద్వాల్ వరకూ సుమారు 23 కిలోమీటర్ల మేర శుక్రవారం భారీ భద్రత మధ్య రాహుల్ పాదయాత్ర మొదలైంది. రాహుల్, ఆయనతో కలిసి యాత్రలో పాల్గొన్న వారికి పోలీసులు, పారామిలటరీ బలగాలు భరీ భద్రత కల్పించారు. జామర్లు ఏర్పాటు చేశారు. కాగా, రాహుల్ జమ్మూలో అడుగుపెట్టగానే ఆయనకు ఘనంగా ఆహ్వానం లభించింది. రాహుల్‌ను కలుసుకునేందుకు కశ్మీర్ అగ్రనేతల్లో ఒకరైన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా లఖన్‌పూర్ నుంచి బయలుదేరి వెళ్లారు. కతువా జిల్లా సరిహద్దులోని పంజాబ్‌లోని మధోపూర్ వద్ద వందలాది మంది నృత్యాలు, పాటలతో రాహుల్‌కు స్వాగతం పలికారు. గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన పాదయాత్ర జనవరి 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే భారీ కార్యక్రమంతో ముగుస్తుంది.

Updated Date - 2023-01-20T15:47:52+05:30 IST