Rahul Gandhi : అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదేలే..

ABN , First Publish Date - 2023-03-25T13:18:08+05:30 IST

ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనర్హత వేటు తర్వాత నేడు ఆయన మీడియా ముందుకు వచ్చారు.

Rahul Gandhi : అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదేలే..

ఢిల్లీ : ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనర్హత వేటు తర్వాత నేడు ఆయన మీడియా ముందుకు వచ్చారు. అదానీ, మోదీ స్నేహం గురించి పార్లమెంట్లో మాట్లాడానన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ అదానీ వ్యవహారంలో ఆధారాలను నేను పార్లమెంట్లో అందజేశాను. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారు? నా గురించి కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారు. గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే... అదానీతో మోదీకి సంబంధాలున్నాయి. లోక్‌సభలో నా ప్రసంగాన్ని కేంద్రం కావాలనే తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించిన అదానికి ఎయిర్‌పోర్టులు కట్టబెట్టారు.

అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్‌కు అన్ని ఆధారాలు ఇచ్చా. లండన్‌ ప్రసంగంపై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు నాకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఎవ్వరికీ భయపడను. నాపై అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదేలే.. ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేది లేదు. నాకు జైలు శిక్షా..? ఐ డోంట్ కేర్.. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా అంతా జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లడమొక్కటే ఇప్పుడు విపక్షాలకున్న ఒకే ఒక్క అవకాశం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-25T13:20:45+05:30 IST