Rain: చెన్నై నగరాన్ని తడిపేసిన వాన
ABN , First Publish Date - 2023-11-26T09:07:03+05:30 IST
నగరంలో రెండు రోజుల విరామం తర్వాత ఉరుములు మెరుపులతో జడివాన మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి తేలికపాటి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో రెండు రోజుల విరామం తర్వాత ఉరుములు మెరుపులతో జడివాన మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వర్షం వేకువజాము 1గంట నుంచి ఉరుములు, మెరుపులతో ఊపందుకుంది. కోయంబేడు(Koyambedu), మదురవాయల్, పురుషవాక్కం, అన్ననగర్, అమింజికరై, వేప్పేరి, గిండి, తాంబరం, అంబత్తూరు, ఆవడి, తిరుముల్లైవాయల్, మీనంబాక్కం, రాయపేట, మాధవరం, మనలి తదితర ప్రాంతాల్లో గంటకు పైగా జోరుగా వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వర్షపునీరంతా రహదారులపై ప్రవహించాయి. ఉదయం 6 గంటల తర్వాత వర్షం ఆగిపోవడంతో రహదారుల్లో నిలిచిన వర్షపునీరంతా ఇంకిపోయింది. కార్పొరేషన్ కార్మికులు మోటరు పంపులతో రహదారులలో ప్రవహిస్తున్న వాననీటిని తొలగించారు. అడయార్‌లో 72 మి.మీ.లు, పెరుంగుడి 44 మి.మీలు, ఆలందూరులో 37మి.మీల వర్షపాతం నమోదైంది. ఇక బంగాళాఖాతంలో ఆదివారం అల్ప వాయుపీడనం ఏర్పడనుండటంతో సముద్రతీర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. చెన్నైకి సంబంధించి తేలికపాటి వర్షాలే కురుస్తాయన్నారు.