Bharat Jodi Yatra: రాహుల్‌ను కలిసిన రాకేష్ టికాయత్
ABN , First Publish Date - 2023-01-09T20:11:29+05:30 IST
భారత్ జోడో యాత్రకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని రాకేష్ టికాయత్ తో సహా పలువురు..
కురుక్షేత్ర: 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra)కు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని రాకేష్ టికాయత్ (Rakesh Tikait)తో సహా పలువురు రైతు నేతలు హర్యానాలోని కురుక్షేత్రలో సోమవారం కలుసుకున్నారు. గత ఏడాది సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగించిన రైతు పోరాటంలో టికాయత్ కీలకంగా వ్యవహరించారు.
కాగా, రాహుల్‌గాంధీని కలుసుకున్న విషయాన్ని టికాయత్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ''ఈరోజు హర్యానాలోని అంబాలాలో రాహుల్ గాంధీని కలిసాం. రైతు అంశాలపై చర్చించాం. నయా రాయ్‌పూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించాం'' అని ఆయన చెప్పారు. కాగా, రాహుల్, టికాయత్ సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ మరిన్ని వివరాలు తెలియజేశారు. కురుక్షేత్ర సమీపంలోని షాహబాద్ వద్ద వివిధ రైతు సంస్థలతో రాహుల్ సంభాషించారని, 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం అమలు, కనీస ఉమ్మడి ధర (ఎంఎస్‌పీ)కు చట్టపరమైన హామీ ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా ఉందని చెప్పారు.