Super blue moon: నేడు ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు మిస్సైతే 14 ఏళ్ల వరకు చూడలేరు..
ABN , First Publish Date - 2023-08-30T17:40:10+05:30 IST
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది. ఆ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. దీంతో అత్యంత ప్రకాశవంతంగా, అతి పెద్దగా చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. ఆ సమయంలో చంద్రుడు భూమి నుంచి 3,57,244 కిలో మీటర్ల దూరంలో ఉంటాడు. సూపర్ బ్లూ మూన్ ప్రారంభమైన 2 గంటల తర్వాత చంద్రుడు అత్యంత ప్రశాశవంతంగా, పెద్దగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బయట వెలుతురు తక్కువగా ఉన్నసమయంలో చంద్రుడు ఇంకా అందంగా కనిపిస్తాడని అంటున్నారు. మన దేశంలో తెల్లవారుజామున చంద్రుడు అత్యంత అందంగా కనిపిస్తాడని చెబుతున్నారు. సాధారణంగా ఒక నెలల ఒకే పౌర్ణమి వస్తుంది. కానీ ఈ నెలలో ఇది రెండో పౌర్ణమి. మొదటి పౌర్ణమి ఆగష్టు 1న వచ్చింది. ఆ రోజు బ్లూ మూన్ కనిపించింది. దీంతో నేడు కనిపించే దానిని సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తున్నారు.
ఈ సందర్భం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే బ్లూ మూన్ అరుదైన వాటితో ముడిపడి ఉంటుంది. అదేవిధంగా ఇది నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్‌లో అదనపు చంద్రుడు. చివరగా సూపర్ బ్లూ మూన్ 2009లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ రావడం ఇప్పుడే కావడం గమనార్హం. తర్వాత మళ్లీ 2037లో సూపర్ బ్లూమూన్ దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం 2037 జనవరి, మార్చిలో మళ్లీ సూపర్ బ్లూ మూన్ దర్శనమివ్వనుంది. అంటే ఆకాశంలో ఈ రోజు సూపర్ బ్లూ మూన్‌ను చూడలేకపోతే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూసే అవకాశం ఉండదు. అయితే బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ రంగులో ఉండడు. నారింజ రంగులో దర్శనమిస్తాడు.
సూపర్ బ్లూ మూన్ అంటే ఏమిటి?
సాధారణంగా ఒక నెలలో ఒకే పౌర్ణమి వస్తుంది. అలా ఒక సంవత్సరంలో 12 పౌర్ణమిలు వస్తాయి. కానీ చాలా అరుదుగా ఒక సంవత్సరంలో 13 పౌర్ణమిలు వస్తాయి. అంటే ఒక నెలలో పౌర్ణమి రెండు సార్లు వస్తుంది. అలా రెండో సారి వచ్చే పౌర్ణమిని సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తారు. ఆ సమయంలో చంద్రుడు సాధారణం కంటే 40 శాతం పెద్దగా.. 30 శాతం శాతం అధిక ప్రకాశవంతంగా కనిపిస్తాడు.