RSS: తమిళనాట సత్తా చాటిన ఆర్ఎస్ఎస్
ABN , First Publish Date - 2023-04-16T22:45:51+05:30 IST
రాష్ట్రమంతటా ఒకే సమయంలో ఆర్ఎస్ఎస్ భారీ యెత్తున ర్యాలీలు నిర్వహించడం ఇదే ప్రథమం.
చెన్నై: తమిళనాట (Tamil Nadu) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) రాష్ట్రమంతటా ఒకే సమయంలో 45 చోట్ల ర్యాలీ నిర్వహించింది. రాష్ట్రంలో ప్రముఖ నగరాలలో, జిల్లా కేంద్రాలలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్రమంతటా ఒకే సమయంలో ఆర్ఎస్ఎస్ భారీ యెత్తున ర్యాలీలు నిర్వహించడం ఇదే ప్రప్రథమం. సుదీర్ఘ న్యాయపోరాటం చేశాకే ఆర్‌ఎస్‌ఎస్ ఈ ర్యాలీలు నిర్వహించగలిగింది.
గత యేడాది అక్టోబర్ రెండు గాంధీ జయంతిరోజున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నించడినప్పుడు పోలీసు శాఖ అనుమతించలేదు. దీనితో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకులు, హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించి ర్యాలీలకు అనుమతి పొందారు. చెన్నై సహా పలు నగరాలలో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ ప్రశాంతంగా సాగింది. చెన్నై కొరట్టూరు ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు హెచ్‌రాజా ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, కరూరు, విరుదునగర్, తిరువణ్ణామలై, తంజావూరు, కుంభకోణం, మదురై, ఈరోడ్, ఊటీ, కరూరు, తిరుప్పూరు తదితర నగరాలలోనూ ఈ ర్యాలీలు కొనసాగాయి. ర్యాలీలకు పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు.