Rahul Gandhi: రాహుల్ గాంధీపై రఘురామ్ రాజన్ ఆసక్తికర స్పందన

ABN , First Publish Date - 2023-01-18T22:18:24+05:30 IST

కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) పప్పుగా (pappu) ముద్రవేయడం దురదృష్టకరమని ఆర్బీఐ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై రఘురామ్ రాజన్ ఆసక్తికర స్పందన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) పప్పుగా (pappu) ముద్రవేయడం దురదృష్టకరమని ఆర్బీఐ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు. వయనాడ్‌ ఎంపీ ఒక తెలివైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో (World Economic Forum) భాగంగా ఇండియా టుడేకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు.

‘దాదాపు దశాబ్దంపాటు అనేక విషయాలపై వాళ్లతో నేను మాట్లాడాను. ఆయన (రాహుల్ గాంధీ) ఎంతమాత్రం పప్పుకాదు. ఆయనొక తెలివైన, యువ, ఆసక్తికలిగిన వ్యక్తి’ అని ప్రశంసించారు. ‘‘ సవాళ్లు, వాటిని అధిగమించడం వంటి ప్రాధాన్యతలు ఏవో గుర్తించే జ్ఞానం కలిగివుండడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఆ విషయంలో రాహుల్ సమర్థవంతుడు’’ అని రాజన్ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించానని, తాను నమ్మే విలువలను పాటిస్తున్నందున భారత్ జోడో యాత్ర (Bharat Jodi Yatra) కూడా పాల్గొన్నానని ఆయన చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా గత నెల్లో రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ రాజస్థాన్‌లో కొనసాగిన సమయంలో రఘరామ్ రాజన్ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T22:18:32+05:30 IST