RSS, Congress: ఆర్‌ఎస్‌ఎస్‌కు భారీ షాకిచ్చిన సిద్దరామయ్య ప్రభుత్వం.. విషయమేంటంటే..

ABN , First Publish Date - 2023-07-15T12:13:07+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం(Chief Minister Siddaramaiah Govt) షాక్‌ ఇచ్చింది. ఆర్‌ఎ

RSS, Congress: ఆర్‌ఎస్‌ఎస్‌కు భారీ షాకిచ్చిన సిద్దరామయ్య ప్రభుత్వం.. విషయమేంటంటే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం(Chief Minister Siddaramaiah Govt) షాక్‌ ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు అప్పటి బీజేపీ(BJP) ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రస్తుతం అప్పగించకుండా షాకిచ్చిది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు బెంగళూరు దక్షిణ తాలూకా కురుబరహళ్ళి పంచాయతీ తావరెకెరె పరిధిలో 35.33 ఎకరాల గోమాళ భూమిని కేటాయించింది. 2023 మే 22న జిల్లాధికారి గోమాళ భూమిని జనసేవా ట్రస్టుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భూమిని అప్పగించేందుకు తగిన అనుమతులను జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు సదరు భూమిని జనసేవా ట్రస్టుకు అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని ఇప్పటికే పలుమార్లు మంత్రులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్‌ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది.

Updated Date - 2023-07-15T12:13:07+05:30 IST