Sabarimala: నేటినుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2023-11-16T07:09:43+05:30 IST
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేది వరకు శబరిమల(Sabarimala)కు ప్రత్యేక
ఐసిఎఫ్(చెన్నై): తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేది వరకు శబరిమల(Sabarimala)కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇళంగోవన్ తెలిపారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చెన్నై, తిరుచ్చి, మదురై వంటి ప్రధాన నగరాలు, పుదుచ్చేరి నుంచి అదనపు బస్సులు నడపను న్నారు. బృందాలుగా వెళ్లే వారికి అద్దెకు బస్సులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు నెం.9445014452, 9445014416లలో సంప్రదించవచ్చు.