Share News

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

ABN , First Publish Date - 2023-10-28T15:29:11+05:30 IST

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)పై వైరాగ్యానంద్ గిరి (Vairagyanand Giri) అలియాస్ మిర్చిబాబా(Mirchi baba)ను సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారంనాడు విడుదల చేసింది. ఇందులో శివారాజ్ సింగ్ పోటీ చేస్తున్న బుద్నీ (Budhni) స్థానం నుంచి ఎస్‌పీ అభ్యర్థిగా మిర్చిబాబా పేరును ప్రకటించింది.


ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కొద్ది రోజుల క్రితం స్వయంప్రకటిత గాడ్‌మన్ మిర్చిబాబాను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్టు సంకేతాలిచ్చారు. ఆయన ఇంటికి కూడా స్వయంగా వెళ్లి కలిసారు. తాజాగా ఆయనను సీఎం శివారాజ్ సింగ్‌కు పోటీగా నిలిపారు. కాగా, అనుప్పూర్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్ సింగ్‌ను మంత్రి విషూలాల్ సింగ్‌పై పోటీకి నిలిపారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మున్నాసింగ్ బదౌరియాను మంత్రి అర్వింద్ బదౌరియాకు పోటీగా నిలబెట్టారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌ ఎన్నికలు నవంబర్ 17న జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-10-28T15:29:11+05:30 IST