Pawar On Modi Campaign : ఎన్నికల ప్రచారంలో మతపరమైన స్లోగనా?: మోదీ తీరుపై పవార్ ఆశ్చర్యం

ABN , First Publish Date - 2023-05-08T13:31:48+05:30 IST

ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతపరమైన నినాదం ఇవ్వడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాలను లేవనెత్తితే అది మరో రకమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, అది మంచిది కాదని వవార్ అన్నారు.

Pawar On Modi Campaign : ఎన్నికల ప్రచారంలో మతపరమైన స్లోగనా?: మోదీ తీరుపై పవార్ ఆశ్చర్యం

ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో (Karnataka Elections Campaign) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మతపరమైన నినాదం ఇవ్వడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాలను లేవనెత్తితే అది మరో రకమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, అది మంచిది కాదని వవార్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రజాస్వామ్య విలువలు, సెక్యులరిజం కాన్సెప్ట్‌ను అంగీకరించాల్సి ఉంటుందన్నారు.

పాంధాపూర్ టెంపుల్ టౌన్‌లో మీడియాతో పవార్ మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా బర్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుపై స్థానికులు చేస్తున్న ఆందోళనలపై మాట్లాడుతూ, ఆ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నానని, అయితే ఎప్పుడనేది సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బర్సు గ్రామ ప్రతినిధులతో సమావేశమవుతానని, నిపుణులతో మరొక సమావేశం జరుపుతానని చెప్పారు. గ్రామస్థుల ఆందోళనను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై తాము ముందుకు వెళ్తామని తెలిపారు.

Updated Date - 2023-05-08T13:31:48+05:30 IST