Pratibha pawar hospitalised: ఆసుపత్రిలో శరద్ పవార్ భార్య
ABN , First Publish Date - 2023-07-14T20:19:20+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్ శుక్రవారంనాడు దక్షిణ ముంబైలోని బ్రీచ్‌క్యాండి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆమె చేతికి శస్ర్రచికిత్స జరుగనుందని పార్టీ ప్రతినిధి తెలిపారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) భార్య ప్రతిభా పవార్ (Pratibha Pawar) శుక్రవారంనాడు దక్షిణ ముంబైలోని బ్రీచ్‌క్యాండి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆమె చేతికి శస్ర్రచికిత్స జరుగనుందని పార్టీ ప్రతినిధి తెలిపారు. ప్రతిభా పవార్ ఆసుపత్రిలో చేరగానే శరద్ పవార్, కుమర్తె సుప్రియా సూలే ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రతిభా పవార్‌ను ఎన్‌సీపీ నేతలంతా 'పెద్దదిక్కు'గా ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే ఎప్పుడూ ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు.
కాగా, ప్రతిభా పవార్ ఆసుపత్రిలో చేరినట్టు మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రతిభా పవార్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్ధిస్తున్నానని, పార్టీ కార్యకర్తలు కూడా ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిభా పవార్ వయసు 56 ఏళ్లు.