Share News

Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సోనియా కీలక సమావేశం

ABN , First Publish Date - 2023-12-04T16:42:40+05:30 IST

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 10 జన్‌పథ్ నివాసంలో ఏర్పాటు చేశారు.

Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సోనియా కీలక సమావేశం

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( Assembly results) వెలువడిన తరుణంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 10 జన్‌పథ్ నివాసంలో ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయాలను కాంగ్రెస్‌ అడ్డుకోలేకపోయిన నేపథ్యంలో ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బీహార్‌లో జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి అధికారంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఆ పార్టీ అధికారంలో ఉంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపొందడం ఆ పార్టీకి ఒకింత ఊరటగా ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సాధించిన విజయం ఇది.


రాహుల్ స్పందన..

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను హుందాగా స్వీకరిస్తున్నట్టు ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ''మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ప్రజల తీర్పును హుందాగా స్వీకరిస్తున్నాం. సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను'' అని ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఒక ప్రకటనలో తెలంగాణ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హిందీ భాష మాట్లాడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నిరుత్సాహం కలిగించిందన్నారు.

Updated Date - 2023-12-04T16:42:41+05:30 IST