Special buses: నేటినుంచి దసరా స్పెషల్ బస్సులు..
ABN , First Publish Date - 2023-10-20T10:17:13+05:30 IST
దసరా పండుగ సెలవులకు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సెలవులకు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఆయుధపూజ, విజయదశమి సెలవులు, వారాంతం శని, ఆదివారాలు వరుసగా వస్తుండటంతో గురువారం నుంచే నగరం నుంచి వివిధ నగరాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. రైళ్లలో టికెట్లు లభించనివారంతా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులలో స్వంత ఊళ్లకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. కోయంబేడు, మధురవాయల్ బైపాస్, తాంబరం మెప్స్ బస్‌స్టేషన్ ప్రాంతాల నుంచి 2264 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. శుక్రవారం వివిధ నగరాల నుండి సుమారు 30 వేలమంది, చెన్నై నుండి 17 వేల మంది తమ స్వంత ఊర్లకు వెళ్లేందుకు టికెట్లు రిజర్వు చేసుకున్నట్లు చెప్పారు.
విమాన ఛార్జీలకు రెక్కలు... : ఇదిలా ఉండగా దసరా సెలవుల సందర్భంగా నగరంలో విమానఛార్జీలు యాభైశాతం వరకూ పెరిగాయి. ఈ మేరకు వివిధ విమానయాన సంస్థలు ముంబాయి, ఢిల్లీ, గోవా, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, హైదరాబాద్, బెంగళూరు(Hyderabad, Bangalore) తదితర నగరాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీ కంటే యాభై శాతం అధికంగా వసూలు చేస్తున్నారు.