Special train: 5న వేలాంకన్నికి ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2023-08-02T09:16:16+05:30 IST

వేలాంకన్ని(Velankanni) ఉత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ రైల్వే ఈ నెల 5వ తేదీన తాంబరం నుంచి ప్రత్యేక రైలు(Special train from Tambaram) నడపనుంది. 5వ తేదీ

Special train: 5న వేలాంకన్నికి ప్రత్యేక రైలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వేలాంకన్ని(Velankanni) ఉత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ రైల్వే ఈ నెల 5వ తేదీన తాంబరం నుంచి ప్రత్యేక రైలు(Special train from Tambaram) నడపనుంది. 5వ తేదీ రాత్రి 10.30 గంటలకు తాంబరంలో బయలుదేరే ప్రత్యేక రైలు (06031).. మరునాడు ఉదయం 5.45 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (06032) ఈ నెల 6వ తేదీన ఉదయం 8.50 గంటలకు వేలాంకన్నిలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ రైళ్లు చెంగల్పట్టు(Chengalpattu), విల్లుపురం, కడలూర్‌ పోర్ట్‌, చిదంబరం, శీర్గాళి, మైలాడుదురై, తిరువారూర్‌, నాగపట్టినం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లకు బుధవారం నుంచే రిజర్వేషన్‌ ప్రారంభమవుతుందని దక్షిణరైల్వే ప్రకటించింది.

nani9.2.jpg

Updated Date - 2023-08-02T09:16:16+05:30 IST