Share News

Special Vande Bharat trains: ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయ్..ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN , Publish Date - Dec 30 , 2023 | 10:23 AM

ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు(Special Vande Bharat trains) నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Special Vande Bharat trains: ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయ్..ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

పెరంబూర్‌(చెన్నై): ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు(Special Vande Bharat trains) నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.06067 చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ వారాంతపు వందే భారత్‌ రైలు జనవరి 4, 11, 18, 25 తేదీల్లో చెన్నై ఎగ్మూర్‌ నుంచి తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌కోయిల్‌ చేరుకుంటుంది. అలాగే, నెం.06068 నాగర్‌కోయిల్‌ - చెన్నై ఎగ్మూర్‌ ప్రత్యేక వారాంతపు వందే భారత్‌ జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నాగర్‌కోయిల్‌ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు చెన్నై ఎగ్మూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌, తిరునల్వేలి స్టేషన్లలో ఆగుతాయని, ఈ రైళ్ల రిజర్వేషన్‌ ప్రారంభమైందని దక్షిణ రైల్వే తెలిపింది.

Updated Date - Dec 30 , 2023 | 10:23 AM