Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి
ABN , First Publish Date - 2023-06-08T09:10:27+05:30 IST
ఎయిరిండియా విమానం ఏఐ173 ప్రయాణికులకు ఎట్టకేలకు కష్టాల నుంచి విముక్తి లభించింది.
న్యూఢిల్లీ : ఎయిరిండియా (Air India) విమానం ఏఐ173 ప్రయాణికులకు ఎట్టకేలకు కష్టాల నుంచి విముక్తి లభించింది. న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణం మగడాన్‌లో మంగళవారం అత్యవసంగా దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విమానంలోని ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు వీరిని మరో విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకెళ్తున్నారు. ఈ విమానం గురువారం బయల్దేరిందని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.
ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్లైట్ ఏఐ173డీ గురువారం ఉదయం 10.27 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మగడాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరింది. సాంకేతిక లోపం ఏర్పడిన విమానంలోని 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఈ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నారు. ఈ విమానం జూన్ 8 రాత్రి 12.15 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంటుంది.
శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్న తర్వాత ప్రయాణికులకు అధికారిక అనుమతులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వైద్య సంరక్షణ, రవాణా, ప్రయాణ సదుపాయాలు వంటివాటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
యూపీలో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ హత్య
Two vehicles: ఆహా.. తెలివి అంటే వీరిది.. కానీ.. చివరకు..