Sukesh Chandrasekhar: బీఆర్‌ఎస్, కేజ్రీవాల్‌పై ఉన్నట్టుండి బాంబ్ పేల్చిన సుఖేశ్.. రూ.75 కోట్ల గుట్టు విప్పడంతో...!

ABN , First Publish Date - 2023-03-31T21:40:38+05:30 IST

కేజ్రీవాల్ తరపున బీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించాడు.

Sukesh Chandrasekhar: బీఆర్‌ఎస్, కేజ్రీవాల్‌పై ఉన్నట్టుండి బాంబ్ పేల్చిన సుఖేశ్.. రూ.75 కోట్ల గుట్టు విప్పడంతో...!
Sukesh Chandrasekhar

ఢిల్లీ: భారత్ రాష్ట్ర సమితి(BRS), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై(Arvind Kejriwal) సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) బాంబు పేల్చాడు. కేజ్రీవాల్ తరపున 2020లో బీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చానని వెల్లడించాడు. ఈ ఆపరేషన్ కోడ్ వర్డ్ 15 కిలోల నెయ్యి అని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికే ఈ మొత్తాన్ని అందజేశానన్నాడు. కేజ్రీవాల్‌తో జరిపిన వాట్సాప్, టెలీగ్రాఫ్ చాట్‌లు 700 పేజీలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు. సిబిఐ(CBI), ఈడీ(ED) కేసులనుంచి విముక్తి కలిగిస్తానంటూ పలువురి వ్యాపారవేత్తల్ని మోసం చేసిన కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు.

కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలతో కూడిన లేఖను తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా సుఖేశ్ బయట పెట్టాడు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని భారత్ రాష్ట్ర సమితి కార్యాలయంలో రూ.75 కోట్లు అందజేసినట్లు లేఖలో వెల్లడించాడు. బీఆర్‌ఎస్ కార్యాలయం లోపల పార్క్ చేసిన రేంజ్ రోవర్‌లో ఉన్న ‘ ఏపి’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందించినట్లు లేఖలో పేర్కొన్నాడు. ‘ ఏపీ’ కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060గా లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌ను త్వరలో తీహర్ క్లబ్‌కు ఆహ్వానిస్తానంటూ ఇటీవల కోర్టులో హాజరైనప్పుడు సుఖేశ్ చంద్రశేఖర్ విలేకరులతో చెప్పాడు. సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాజధాని ఢిల్లీతో పాటు తెలంగాణలో సంచలనం రేపుతోంది.

రూ.200 కోట్ల హవాలా కేసులో సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నిందితుడు. వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి జైలు ఊసలు లెక్కిస్తున్నాడు. జైలు బయట ఎంత విలాసవంతంగా బతికాడో.. జైల్లో కూడా అదే అనుసరించాడు. అకస్మాత్తుగా అతడి జైలు గదిని తనిఖీ చేసిన అధికారులు అక్కడ దొరికిన ఖరీదైన వస్తువులను చూసి విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే అతడు వాడే బ్రాండెడ్‌ గుస్సీ చెప్పుల విలువ రూ.లక్షన్నర కాగా, అతడి 3 జీన్స్‌ ప్యాంట్ల విలువ రూ.80 వేలు.

Updated Date - 2023-04-06T19:54:32+05:30 IST