Delhi: ఇంజినీరింగ్ చదివి ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్న షానవాజ్
ABN , First Publish Date - 2023-10-02T17:36:12+05:30 IST
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని విచారణ చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది(Terrorist) అయిన అతను అలీగఢ్ యూనివర్సిటీ(Aligarh University) నుండి బీటెక్ పూర్తి చేసి జామియా మిలియాలో ఇస్లామియా కోర్సును అభ్యసిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదివి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నాడు.
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని విచారణ చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది(Terrorist) అయిన అతను అలీగఢ్ యూనివర్సిటీ(Aligarh University) నుండి బీటెక్ పూర్తి చేసి జామియా మిలియా ఇస్లామియాలో కోర్సు అభ్యసిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదివి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నాడు. ఇవాళ పట్టుబడిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీ విధించింది. షఫీ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.
ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతన్ని పట్టించిన వారికి రూ.3 లక్షల రివార్డును ఇస్తామని గతంలోనే ఎన్ఐఏ ప్రకటించింది. ఢిల్లీ(Delhi)లోని ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్ నుంచి పక్కా సమాచారంతో రావడంతో అతన్ని పట్టుకోవడానికి స్కెచ్ వేసి.. పకడ్బందీగా బంధించారు. దేశ రాజధానితో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్ట్ ముఠా పథకం పన్నిందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఐసిస్ మాడ్యూల్ కేసులో వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. ఢిల్లీలో నివసించే అతను గతంలో పుణె పోలీసుల కస్టడీ(Police Custody) నుండి తప్పించుకున్నాడు.